హలమే కలమై అక్షర సేద్యం చేసిన కాపుబిడ్డ.....
సాలు సాలును తన గుండె గొంతుకగా వినిపించిన మట్టిమనిషి.....
కృషీవలుడి తలపాగై వెలుగొందిన భూమిపుత్రుడు.....
ఓ రైతు గర్జన....
ఓ సాహిత్య స్పూర్తి....
గంగుల శాయిరెడ్డి !వీరి స్వస్థలం పూర్వ నల్లగొండ జిల్లా
ఇప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన జీడికల్లు గ్రామంలో 1890లో శివారెడ్డి, రామక్క దంపతులకు వీరు
జన్మించారు. కీర్తనలు పాడే గాయకుడుగా పుట్టిన జీడికల్ గ్రామంలోనే వీధి బడిలో ఓనమాలు నేర్చుకున్నాడు.ఆ తర్వాత మహా భారతము, రామాయణము, భాగవతం కథలను అభ్యసించాడు. అందలి పద్యాలను కంఠస్థం చేసాడు. రామదాసుగా పిలవబడిన కంచర్ల గోపన్న, అన్నమయ్య, రాకమచర్ల వేంకటదాసులు రాసిన కీర్తనలను కూడా కంఠస్థం చేసాడు. సాయిరెడ్డి మధుర గాయకుడు కూడా. ఆలపించేవాడు. తాను కంఠస్థం చేసిన పద్యాలనూ కీర్తనలను రాగయుక్తంగా ఆలపించేవాడు.
రచయితగా సాహిత్యం అంటే రాజులు వారి పల్లకీలు, యుద్దాలు వారు గెలిచిన రాజ్యాలు, ఇవి మాత్రమే కాదు అంటూ.... రైతుల జీవితం కూడా గొప్ప సాహిత్యమే అంటూ.... రైతు బతుకును సాహిత్యంగా మలిచిన మహనీయుడు శాయిరెడ్డి. సాహిత్యకారుడిగా శాయిరెడ్డి ప్రస్థానం గొప్పది. వీరి రచనల్ని గమనిస్తే...
ముద్రిత_రచనలు
1)'కాపుబిడ్డ' వ్యవసాయం ప్రధాన అంశంగా కొనసాగిన పద్యకావ్యం. వ్యవసాయంలో ఉన్న కష్ట నష్టాలు ఈ కావ్యంలో పద్య రూపాల్లో చెప్పబడ్డాయి.
2) తెలుగు పలుకు
3) వర్ష యోగం
3) మద్యపాన నిరోధం
4 )బాలశిక్ష కూర్పు. వయోజన విద్య అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సాయిరెడ్డి బాలశిక్ష కూర్చాడు. ఈ క్రమంలో నాలుగు బాలశిక్షలలు రచించాడు. ఇవన్నీ ముద్రితాలు.
అముద్రిత_రచనలు
5)గణిత రహస్యం
6) ఆరోగ్య రహస్యం
రచయితగా మాత్రమే కాదు పోరాట వీరుడుగా కూడా తన శక్తిని చాటుకున్నాడు శాయిరెడ్డి. నిజాం వ్యతిరేక పోరాటంలో తన వంతు కర్తవ్యంగా ప్రజల పక్షాన నిలిచాడు. నిజాం ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యాడు. ఫలితంగా జైలు జీవితం గడిపాడు.
పాఠ్యాంశంగా బోధించబడుతున్నది. అప్పట్లో ఈ కావ్యం గొప్పతనాన్ని తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావులు గుర్తించి ప్రంశంసించారు.
ఇచ్చుచుండు ను నీశ్వరుడింద్ర పదవి
వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత
దాని జూడవు కన్నెత్తి తాపేసేంద్రా? !
కర్షకా ! నిన్ను కెలెత్తి గౌరవింతు !
అంటే.... ఒక రైతుకు భగవంతుడు ఇంద్రపదవి ఇస్తున్నాడు. ప్రకృతి కాంత రైతును వలిచి వస్తున్నది. కానీ రైతు దేన్నీ పట్టించుకోలేదు. తన వృత్తిని గౌరవిస్తూ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందుకే రైతుకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటున్నాడు. సాయిరెడ్డికి రైతుల మీద ప్రేమ, గౌరవం, ఎంత ఉందో ఈ పద్యం ఒక్కటి చూసినా అర్థం అవుతుంది. సంఘ_సంస్కర్తగా ఆలేరు, పెంబర్తి, కొలనుపాక, జీడిపల్లి గ్రామాల్లో
సాయిరెడ్డి 1916 నుంచి 1926 వరకు
వీధి బడులు నడిపాడు. చదువుకోవాలని ఆసక్తి ఉన్న పిల్లలను గుర్తించి చదువు చెప్పాడు.
నెలకు ఐదు రూపాయల జీవనభృతిని పొందిన సాయిరెడ్డి, ఆ ఐదు రూపాయలను పేద ప్రజల కోసం ఉపయోగించేవాడు.
విద్యార్థుల ఇబ్బందుల్ని గుర్తించి 1936-39 సంవత్సరాల్లో భువనగిరి, నెల్లుట్ల, గుమ్మడవెల్లి గ్రామాల్లో వసతిగృహం ఏర్పాటు చేశాడు. ఎందరో విద్యార్థులకు తిండి నీడ కల్పించి తన ఉదారతను చాటుకున్నాడు. చిరస్మరణీయులు పేదల కోసం పనిచేసి -
రైతు శ్రేయస్సు కోసం పరితపించి -
అక్షరం కోసం ఆత్రుతపడిన శాయిరెడ్డి
తెలుగు సాహిత్య ప్రపంచంలో చిరస్మరణీయులు. !
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి