మా గ్రంథాలయం అడవిలో జ్ఞాన జ్యోతి
మా గ్రంథాలయం నా ఆలోచనలకు
వెలుగు చూపే సూర్యుడు
నిశ్శబ్దంలో నన్ను నేను మరచిపోయే
నవ కుటీరం
బాల్యంలో నాకు అమ్మే ఓ గ్రంథాలయం
మహనీయుల జీవితాలకు
మంచిచెడుల మనోవికాసాలకు
చిరునామా గ్రంథాలయం
చదువురాని వాడికి సైతం
సర్వస్వం తానై మహోన్నతుడిని
చేస్తుంది ఈ గ్రంథాలయం
ఆలయంలో పూజారులు ,గంటల
ధ్వనులు ఉంటాయి కానీ
మా గ్రంథాలయం, పూజారులు
గంటలు, హుండీలు లేని ఆలయం
భగవంతుడివ్వని వరాలను
సైతం నాకీ గ్రంథాలయం
ఇస్తుంది .
నాలోని ప్రతిభకి
నా సమస్యలకి పరిష్కారం గ్రంథాలయం.
దానిలోకి అడుగుపెడితే పుస్తకాలన్నీ
నన్ను పలకరిస్తున్నట్లు
నీకేదో చేబుతామంటూ
పుస్తక పేర్లతో కనిపిస్తుంది .
ఈ సమాజానికి నేనొక
జ్ఞాన బండాగారమన్నట్లు
ఉంటుంది ఈ గ్రంథాలయం.
నాలుగు గోడలమధ్య నన్ను చదివి
నవసమాజం నిర్మించమన్నట్లు
నాకు భోదిస్తుంది ఈ గ్రంథాలయం
పచ్చని చెట్ల మధ్య
కలుపు మొక్కలు లేని పంటలా
గగనంలోని జాబిల్లిలా
ఆ పుస్తకాలన్నీ నా
జీవితానికి వేలుగునిస్తాయి .
నాలోని అజ్ఞానమనే చీకటిని
తొలగిస్తుంది ఈ గ్రంథాలయం
ఇంట్లోని మొదటి గురువులు
అమ్మనాన్నలయితే
తరగతి గదిలోని ఆచార్యులు
రెండో గురువైతే
అన్నివేళలా
అందరికి ఆది గురువైయింది
ఈ గ్రంథాలయం.
యస్.వేణుగోపాల్
యం,ఎ.తెలుగు