కాకతీయులుకాకతీయులు (క్రీ.శ.995-1323) - కాకతీయ వంశ స్థాపకుడు 1వ బేతరాజు
- వీరి యొక్క మూలపురుషుడు వెన్నడు
- మొట్టమొదటి స్వతంత్రపాలకుడు రుద్రదేవుడు
- అందరిలో గొప్పవాడు గణపతిదేవుడు
- కాకతీయులలో చివరి రాజు 2వ ప్రతాప రుద్రుడు
- వీరియొక్క రాజధాని హనుమకొండ, ఓరుగల్లు
- వీరియొక్క రాజ భాష సంస్కృతం
- రాజచిహ్నం వరాహం
- శాతవాహనుల తరువాత తెలుగు ప్రాంతాన్ని ఒక దగ్గరకు తీసుకు వచ్చిన వారు కాకతీయులు.
- కాకతీయుల గురుంచి మొట్టమొదటిసారిగా మాగల్లు శాసనం (క్రీ.శ. 956) లో ప్రస్తావించబడింది. ఈ శాసనాన్ని వేయించినవారు వేంగీ చాళుక్య రాజు దానర్ణవుడు.
- కాకతి దేవత పేరు మీదుగానే వీరికి కాకతీయులు అని పేరు వచ్చింది.
- వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం ప్రకారం వీరు ఓరుగల్లులో కాకతి, ఏకవీర అనే గ్రామ దేవతలను పూజించారని, ఓరుగల్లు కోటలో కాకతమ్మ దేవాలయం ఉండటం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది.
- కాకతి అనగా దుర్గాశక్తి అని విద్యానాథుని ప్రతాపరుద్ర యశోధం కూడా వివరిస్తుంది.
- "కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంతి ఇతి కాకతీయ" అని విద్యానాధుడు పేర్కొన్నాడు.
- గణపతిదేవుని సోదరి 'మైలాంబ' బయ్యారం శాసనం వేయించింది. దీనిలో కాకతీయుల వంశం గురుంచి వివరించబడింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు. ఇతను రాష్ట్ర కూటుల సేనాపతిగా ఉండి వేంగి చాళుక్యులపై యుద్ధం చేశాడు.
- వెన్నడు యొక్క నాల్గవ తరం వాడు కాకతీ గుండ్యన. ఇతను వేంగి చాళుక్య రాజు మొదటి భీముడికి వ్యతిరేకంగా నిరువద్యపురం (క్రీ.శ. 900) చేశాడు. ఈ యుద్ధంలో భీముని కుమారుడు ఇరుముర్తి కాకతీయ గుండ్యను హతమార్చాడు. ఇతని ధైర్యసాహసాలకు 2వ కృష్ణుడు గుండ్యన కుమారుడు ఎర్రయ ను కొరివి ప్రాంతానికి పాలకుడిగా చేశాడు.
- ఎర్రియ అనంతరం బేతియ కొరివి పాలకుడు అయ్యాడు.
- బేతియ అనంతరం 4వ గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన కొరివి పాలకుడు అయ్యాడు. అప్పుడు వేంగి చాళుక్య రాజ్యంలో దానార్ణవుడు మరియు 2వ అమ్మరాజు మధ్య వారసత్వ యుద్దాలు ప్రారంభమైనాయి. ఈ వారసత్వ యుద్ధంలో కాకర్త్య గుండ్యన దానార్ణవుడికి మద్దతు పలికాడు. దీనికి బదులుగా దానార్ణవుడు 'నతవాటి సీమ' ను కాకర్త్య గుండ్యనకు ఇచ్చాడు.
- ఇదే సమయంలో రాష్ట్రకూట రాజు 2వ కృష్ణుడు మరణించాడు. దీనితో రాష్ట్రకూటలు పతనం అయ్యారు.
- రాష్ట్రకూట చివరి రాజు 2వ కర్కరాజు ను 2వ తైలవుడు ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు.
- అప్పుడు కాకర్త్య గుండ్యన 2వ తైలవుడికి సామంతుడు అయ్యాడు. ఇతను హనుమకొండ రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి 1వ బేతరాజు జన్మించాడు. ఇతను గుమ్మడికాయ వలె ఉండేవాడు.
- కాకతి అనగా గుమ్మడి అని అర్ధం.
- 1వ బేతరాజు కాలం నుంచి వీరిని కాకతీయులు అనేవారు.
- కాకర్త్య గుండ్యన సోదరి పేరు కామసాని. ఈమె భర్త విరియాల ఎర్ర భూపతి / ఎర్ర సేనాని. ఇతను 2వ తైలవుడికి సేనాధిపతి. ఇతని సహాయంతో ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు కాకర్త్య గుండ్యనను హతమార్చాడు.
- దీని తరువాత 1వ బేతరాజు అనుమకొండకు పాలకుడిగా ప్రకటించ బడ్డాడు.
- ఈ విధంగా అనుమకొండలో 1వ బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు.
తొలి కాకతీయులు
1వ బేతరాజు (క్రీ.శ. 995-1052)
- ఇతను పశ్చిమ చాళుక్యుల సామంతుడు
- ఇతను రాజ్యాన్ని అనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు
- ఇతని యొక్క బిరుదులు కాకతి పునాదినాథ, చోడక్ష్మపాల
- ఇతనికి సంరక్షకులుగా కామసాని(మేనత్త) మరియు విరియాల ఎర్ర భూపతి ఉండేవారు.
- ఇతని మంత్రి నారాయణయ్య జీనాలయమునకు మరమత్తులు చేయించి 'శనిగరం శాసనం' వేయించాడు .
- ఇతను కూడా శనిగరం శాసనం వేయించాడు.
- ఇతని యొక్క బిరుదులు అరిగజకేసరి, కాకతి వల్లభ, సమదీగతపంచమశబ్ద
- ఇతను కేసముద్రం, జగత్ కేసరి సముద్రం చెరువులను త్రవ్వించాడు.
- ఇతను వరాహ చిహ్నంతో నాణెములను ముద్రించినాడు.
- ఇతనియొక్క బిరుదులు విక్రమచక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తిగండ
- ఇతను వేయించిన శాసనం, దీని ప్రకారం ఇతనొక గొప్ప యుద్ధ వీరుడు.
- ఇతను రామేశ్వర పండితుని దగ్గర శైవ దీక్షను పొందాడు.
- ఇతను హనుమకొండలో బేతేశ్వరాలయమును నిర్మించాడు.
- ఇతని యొక్క బిరుదులు త్రిభువనమల్ల, చలమర్తిగండ
- ఇతను అనుమకొండ బేతేశ్వరాలయాన్ని రామేశ్వర పండితునికి దానం చేశాడు.
- ఇతని యొక్క బిరుదు మహామండలేశ్వర, దారిద్ర్య విద్రావణ
- ఇతను తోలి కాకతీయులలో గొప్పవాడు.
- ఇతని కాలంలోనే ఓరుగల్లు కోటను ప్రారంభించారు.
- ఇతని భార్య పేరు ముక్కమాంబ, ఈమె నటవాడి పాలకుడు దుర్గరాజు సోదరి
- ఇతను శ్రీశైలం లో విజయ స్తంభాన్ని నాటాడు
- 3వ సోమేశ్వరుడు మరణానంతరం కళ్యాణి చాళుక్య రాజ్యం పతనమైంది. ఈ పతనం తరువాత రుద్రదేవుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
కళ్యాణి చాళుక్యులు బలహీన మవ్వడంతో రుద్రదేవుడు హనుమకొండలో పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొదటి కాకతీయ రాజు
ఇతను హనుమకొండ శాసనం, గణ పాంప గణపవరం శాసనాలు వేయించాడు
ఈ రెండు శాసనాల్లో తన తండ్రి 2వ ప్రోలరాజు యొక్క విజయాల గురుంచి వివరించాడు.
హనుమకొండ శాసనాన్ని అచింతేంద్రుడు లిఖించాడు.
రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు
ఇతను ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించి రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చాడు.
రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చినది 'గణపతిదేవుడు'
ఇతను ఉదయచోడుడు కుమార్తె పద్మావతిని వివాహమాడిన సందర్భంగా రుద్రసముద్ర తటాకం అనే చెరువును త్రవ్వించాడు.
ఇతను సంస్కృతంలో నీతిసారం అనే గ్రంధాన్ని రచించాడు.
ఇతను విద్యాభూషణ అనే బిరుదును పొందాడు.
క్రీ.శ. 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో ఇతను నలగామరాజు కు మద్దతు తెలిపాడు
ఇతనికి రాజ్యపాలనలో గంగాధరుడు అనే మంత్రి సహకరించాడు. దీనితో రుద్రదేవుడు గంగాధరుడుని సబ్సి మండలానికి నాయకుడిని చేశాడు.
గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు.
రుద్రదేవుని యొక్క సేనాని 'కోట సేనాని. ఇతనికి కోటగెల్వటా అనే బిరుదు కలదు.
ఇతని కాలంలోనే యాదవులు దేవగిరి వద్ద పూర్తి స్వతంత్ర పాలన ప్రారంభించారు.
యాదవ రాజు జైతూగి రుద్రదేవుడుని హతమార్చాడు.
మహాదేవుడు (క్రీ.శ. 1196 - 1199)
రుద్రదేవునికి సంతానం లేని కారణంగా అతని తమ్ముడైన మహాదేవుడు పాలకుడయ్యాడు.
మహాదేవునికి గణపతిదేవుడు అనే కుమారుడు, మైలాంబ, కుదంబిక అనే కుమార్తెలు కలరు.
తన ఇద్దరి కుమార్తెలను నతవాడి పాలకులైన ఒక్కలిక (మైలాంబ), మొదటి రుద్రుడు (కుందాంబిక ) కు ఇచ్చి వివాహం చేశాడు.
ఇతని శైవ మత గురువు 'దృవేశ్వర పండితుడు'
యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దండెత్తి మహాదేవుడిని కూడా హతమార్చాడు.
రుద్రదేవుడు / 1వ ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1158 - 1196)
కళ్యాణి చాళుక్యులు బలహీన మవ్వడంతో రుద్రదేవుడు హనుమకొండలో పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు.
ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొదటి కాకతీయ రాజు
ఇతను హనుమకొండ శాసనం, గణ పాంప గణపవరం శాసనాలు వేయించాడు
ఈ రెండు శాసనాల్లో తన తండ్రి 2వ ప్రోలరాజు యొక్క విజయాల గురుంచి వివరించాడు.
హనుమకొండ శాసనాన్ని అచింతేంద్రుడు లిఖించాడు.
రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు
ఇతను ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించి రాజధానిని పాక్షికంగా ఓరుగల్లుకు మార్చాడు.
రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చినది 'గణపతిదేవుడు'
ఇతను ఉదయచోడుడు కుమార్తె పద్మావతిని వివాహమాడిన సందర్భంగా రుద్రసముద్ర తటాకం అనే చెరువును త్రవ్వించాడు.
ఇతను సంస్కృతంలో నీతిసారం అనే గ్రంధాన్ని రచించాడు.
ఇతను విద్యాభూషణ అనే బిరుదును పొందాడు.
క్రీ.శ. 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో ఇతను నలగామరాజు కు మద్దతు తెలిపాడు
ఇతనికి రాజ్యపాలనలో గంగాధరుడు అనే మంత్రి సహకరించాడు. దీనితో రుద్రదేవుడు గంగాధరుడుని సబ్సి మండలానికి నాయకుడిని చేశాడు.
గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు.
రుద్రదేవుని యొక్క సేనాని 'కోట సేనాని. ఇతనికి కోటగెల్వటా అనే బిరుదు కలదు.
ఇతని కాలంలోనే యాదవులు దేవగిరి వద్ద పూర్తి స్వతంత్ర పాలన ప్రారంభించారు.
యాదవ రాజు జైతూగి రుద్రదేవుడుని హతమార్చాడు.
మహాదేవుడు (క్రీ.శ. 1196 - 1199)
రుద్రదేవునికి సంతానం లేని కారణంగా అతని తమ్ముడైన మహాదేవుడు పాలకుడయ్యాడు.
మహాదేవునికి గణపతిదేవుడు అనే కుమారుడు, మైలాంబ, కుదంబిక అనే కుమార్తెలు కలరు.
తన ఇద్దరి కుమార్తెలను నతవాడి పాలకులైన ఒక్కలిక (మైలాంబ), మొదటి రుద్రుడు (కుందాంబిక ) కు ఇచ్చి వివాహం చేశాడు.
ఇతని శైవ మత గురువు 'దృవేశ్వర పండితుడు'
యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దండెత్తి మహాదేవుడిని కూడా హతమార్చాడు.
గణపతి దేవుడు (క్రీ.శ. 1199 - 1162)
ఇతను అత్యధికంగా 63 సంవత్సరాలు పరిపాలించాడు
యాదవ రాజు జైతూగి కాకతీయ రాజ్యంపై దాడి చేసి అప్పటి పాలకుడైన మహాదేవుని హతమార్చి వారసుడైన గణపతిదేవుణ్ణి తనతోపాటు దేవగిరికి తీసుకొనిపోయాడు. దీనితో కాకతీయ రాజ్యం సంక్షోభంలో పడింది.
మహాదేవుని సైన్యాధిపతి అయిన రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని సంక్షోభం నుండి కాపాడాడు. దీనితో అతనికి కాకతీయ రాజ్యభార దౌరేయుడు, కాకతీయ రాజ్య సమర్థుడు అనే బిరుదులు ఇవ్వబడ్డాయి.
దేవగిరిలో గణపతి దేవుని మేథస్సు ను చుసిన జైతూగి అతన్ని విడుదల చేశాడు.
గణపతి దేవుడు విడుదలలో జైతూగి కుమారుడు సింగనుడు సహకరించాడు.
క్రీ.శ. 1199 లో గణపతి దేవుడు కాకతీయ పాలకుడు అయ్యాడు.
ఇతను రేచర్ల రుద్రుని సహాయంతో కాకతీయ రాజ్యాన్ని విస్తరించాడు.
ఇతను అనేక దండ యాత్రలు చేశాడు అందులో ముఖ్యమైనవి
నెల్లూరు
నెల్లూరు ప్రభువు 1వ మనువసిద్ధి మరణాంతరం అతని కుమారుడు తిక్కసిద్ధి నెల్లూరు ప్రభువు అవ్వడానికి సహకరించాడు. దీనికి గాను తిక్కసిద్ధి గణపతి దేవునికి పాకనాటిని అనే గ్రామాన్ని ఇచ్చాడు. గణపతి దేవుడు పాకనాటిని పాలించుటకు గంగా సాహిణి ని పంపాడు.
తిక్కసిద్ధి మరణాంతరం విజయగొండ గోపాలుడు ఇతరుల సహాయంతో నెల్లూరు ప్రభువు అయ్యాడు. దీనితో తిక్కసిద్ధి కుమారుడైన 2వ మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన గణపతి దేవుడిని కలిసి తన రాజు తరుపున సహాయం కోరాడు
దీనితో గణపతి దేవుడు సామంత భోజుడిని నెల్లూరుకు పంపాడు. సామంత భోజుడు వలయూర్ యుద్ధంలో విజయగొండ గోపాలుడిని ఓడించి 2వ మనుమసిద్దిని నెల్లూరు ప్రభువుగా చేశాడు.
దీనికి గాను 2వ మనుమసిద్ధి గణపతి దేవుడికి మోటుపల్లి ఓడరేవుని ఇచ్చాడు. గణపతి దేవుడు మోటుపల్లి ఓడ రేవుని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధిపరచి విదేశీ వరకుల కొరకు అనేక నియమ నిబంధనలతో మోటుపల్లి అభయ శాసనాన్ని రుపొందించాడు. మోటుపల్లిలో అభయ శాసనమును అమలుపరుచుటకు సిద్దయ్యదేవున్ని పంపాడు.
తీరాంధ్ర:
తీరాంధ్రలోని దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమించుటకు ముత్యాల చౌదరాయుడు ని పంపాడు
ఇతను తీరాండ్రను పాలిస్తున్న అయ్య వంశానికి చెందిన పినచోడిని ఓడించి, దీపి లుంటాక, దీవి చూరకార అనే బిరుదులు పొందాడు.
పినచోడి ఓటమి అనంతరం తన కుమార్తెలు అయినా నూరంబ, పెరంబలను గణపతిదేవునికిచ్చి వివాహం చేశాడు.
పినచోడి కుమారుడైన జాయపసేనాని కాకతీయ గజ దళపతిగా నియమించబడ్డాడు.
జాయపసేనాని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి అనే గ్రంధంలులను సంస్కృత్రములో రచించాడు.
కళింగ
కళింగ ఆక్రమణ కొరకు రేచర్ల రాజానాయకుడు, చోడ భీముడు అనే సేనాపతులు పంపబడ్డారు. వీరు కళింగ రాజు అయిన గోదుమర్రటిని ఓడించి గంజాం, ఉదయగిరి, బస్తర్ ప్రాంతాలను ఆక్రమించారు.
ఈ విధంగా గణపతి దేవుడు మొత్తం ఆంధ్రదేశంలో పాటు దక్షిణ ఒరిస్సా, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ప్రాంతాలను కూడా పాలించాడు.
రేచర్ల రుద్రుడు పాలంపేటలో 1213లో రామప్పగుడిని నిర్మించాడు.
రామప్పగుడి ఏకశిలా కోవకు చెందుతుంది.
గణపతి దేవుని రథ దళాధిపతి 'గంగయ్య సేనాని'
గంగయ్య సేనాని యొక్క బిరుదులు - మాండలిక బ్రహ్మరాక్షస, రక్కశ గంగ, గండపెండేర
గణపతి దేవుడు ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మించి రాజధానిని పూర్తిగా ఓరుగల్లుకు మార్చాడు. ఓరుగల్లు కోటను ఏడు మట్టి కోటల నగరమని కూడా అంటారు.
ఇతను ఓరుగల్లులో స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు (దీనిని ప్రారంభించింది 2వ ప్రోలరాజు)
ఇతను రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను త్రవ్వించాడు.
పాండ్యరాజు జటావర్మ సుందరపాండ్య ముత్తుకూరు యుద్ధంలో నెల్లూరు ప్రభువు అయిన 2వ మనువసిద్ధిని హతమార్చాడు
కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ముత్తుకూరు యుద్ధంలోనే గణపతి దేవుడు కూడా హతమార్చబడ్డాడు.
ఇతనికి ఇద్దరు కుమార్తెలు:
రుద్రమాంబ / రుద్రమదేవి (భర్త చాళుక్య వీరభద్రుడు)
గణమాంబ (భర్త బేతరాజు)
పాండ్యరాజు జటావర్మ సుందరపాండ్య ముత్తుకూరు యుద్ధంలో నెల్లూరు ప్రభువు అయిన 2వ మనువసిద్ధిని హతమార్చాడు
కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ముత్తుకూరు యుద్ధంలోనే గణపతి దేవుడు కూడా హతమార్చబడ్డాడు.
ఇతనికి ఇద్దరు కుమార్తెలు:
రుద్రమాంబ / రుద్రమదేవి (భర్త చాళుక్య వీరభద్రుడు)
గణమాంబ (భర్త బేతరాజు)
రుద్రమదేవి (క్రీ.శ. 1262 - 1289)
రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి, కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీర వనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతి దేవునికి సంతానం లేదు అందువల్లన రుద్రంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడురుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమ్ముడమ్మ, ఈమె మహాదేవుని భార్య, వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిక్షేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశ కర్తగా చెప్పుకున్నారు.
రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాధిపతి మరియు మహ ప్రధాని.
జీవిత విశేషాలు:
కాకతీయులలో గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి 'రుద్రమహారాజు' బిరుదుతో కాకతీయ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేశారు. అదే సమయంలో నెల్లూరు పాండ్యుల కింద వేంగీ ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకు వెల్లినాయి. పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరబాణుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమదేవి తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లన్నింటిని అణచివేసింది.
రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలల్లో దేవగిరి యాదవ రాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు అయితే రుద్రమదేవి యాదవులను ఓడించి, దేవగిరి దుర్గం వరకు తరిమి కొట్టింది. వేరే దారి లేక మహాదేవుడు సంధికి దిగి వచ్చి యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు.
రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, 2వ ప్రతాపరుద్రుని కూడా ఈయనే గురువు. రుద్రమదేవి తానె స్వయంగా కాయస్థ రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తుంది. కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధాలలో రుద్రమదేవి మరణించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
రుద్రమదేవి కల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోదృతి.
ప్రఖ్యాత పథికుడు 'మార్క్ పోలో' చైనా దేశంనుండి తిరిగి వెళ్తూ దక్షిణ భారతదేశమును సందర్శించి రుద్రమదేవి గురుంచి, ఆమె పాలన గురుంచి బహువిధములుగా పొగిడాడు. మోటుపల్లి రేవు నుంచి కాకతీయుల సముద్ర వ్యాపారము గురుంచి కూడా వివరముగా వ్రాసాడు.
ఓరుగల్లుపై తురుష్కుల దండయాత్రలు
కొన్ని గ్రంధాల ప్రకారం ఓరుగల్లుపై 8 సార్లు, మరికొన్ని గ్రంథాలు 5 సార్లు దండయాత్రలు చేసినట్లుగా వివరిస్తున్నాయి. కాని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 5 సార్లు దండయాత్రలు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఈ దండయాత్రలకు సంబంధించి ఆధారాలు
అమీర్ ఖస్రు రచనలు
అబ్దుల్ వాసప్ రచనలు
పైన పేర్కొన్న గ్రంధాలు 5 సార్లు దండయాత్ర చేసినట్లుగా ఉన్నాయి.
ఈ క్రింది పేర్కొన్నవి 8 సార్లు దండయాత్ర చేసినట్లుగా ఉన్నాయి.
కాసే సర్వప్ప - ప్రతాప చరిత్ర
ప్రోలయ్య నాయకుడు -- విలాస శాసనం
కలువచేరు శాసనం
మొదటి దండయాత్ర 1303
ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
దండయాత్ర జరిపిన సేనాపతి మాలిక్ ఫక్రుద్దీన్ జునా
ఉప్పరపల్లి (కరీంనగర్) యుద్ధంలో కాకతీయ సైన్యం చేతిలో ఓడిపోయారు
అతనిని ఓడించిన కాకతీయ సేనాపతులు రేచర్ల వెన్నడు, కొలిగింటి మైలి
రెండవ దండయాత్ర 1309-10
ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316)
ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది మాలిక్ కాఫర్
ఇతను ఓరుగల్లుపై దాడి చేసిన మార్గం బసీర్గర్ - సర్బార్ - కూనర్ బార్ - హనుమకొండ - వరంగల్
2వ ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు
మూడవ దండయాత్ర 1317-18
ఆ నాటి ఢిల్లీ సుల్తాను ముబారక్ ఖిల్జీ (1316-20)
ఈ దండయాత్రలకు నాయకత్వం వహించింది ఖుస్రూ ఖాన్ (అమీర్ ఖుస్రూ)
ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు
నాల్గవ దండయాత్ర 1321-22
ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాను గియాజుద్దీన్ తుగ్లగ్ (1320-25)
ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునాఖాన్ మొహ్మద్ బిన్ తుగ్లక్
ఆయన వెంట వచ్చిన జ్యోతిష్యుడు ఉభయ్యద్ తన తండ్రి గియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడని ఊహించి చెప్పడం వల్లన వెనుతిరిగిన ఢిల్లీ సైన్యాలను కొలచెలను యుద్ధంలో ఓడించిన వారు ఏచనాయక (కొసగి వంశం)
ఐదవ దండయాత్ర 1323
ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాను గియాజుద్దీన్ తుగ్లక్
ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునాఖాన్ మొహ్మద్ బిన్ తుగ్లక్
ఈ దండయాత్రలో కాకతీయ సైన్యం ఓడిపోయి ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది
యుద్ధ సమయంలో సైన్యం నుండి వైదొలిగి శత్రువుల పక్షాన చేరి కాకతీయుల ఓటమికి పరోక్షంగా కారణమైనవాడు -- బొబ్బారెడ్డి
కాకతీయుల పరిపాలన
వీరి పరిపాలనలో వికేంద్రీకృత రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు
రాచరికం పితృస్వామికంగా ఉండేది.
కాకతీయుల కాలంలో రాజ్యం క్రింది విధంగా విభజించబడింది
రాజ్యం -- రాజు
నాడు -- అమాత్యులు
స్థలం -- స్థలకాపతి
గ్రామం -- గ్రామాధిపతి (12 మంది)
పరిపాలనలో రాజుకు సహకరించడానికి అనేకమంది మంత్రులు ఉండేవారు. వీరిలో ముఖ్యమైనవారు మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడ (అంతఃపుర అధ్యక్షుడు), అమాత్య.
నాడులో నాయంకర / నాయక వ్యవస్థను మొట్టమొదటి సరిగా ప్రవేశపెట్టిన వాడు -- గణపతిదేవుడు
వీరి రాజ్యంలో మొత్తం 77 మంది నాయకులు ఉండేవారు. వీరికి పన్ను వసూలుతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత కూడా ఉండేది.
వీరు కార్యకలాపాలను నిబంధలప్రకారం నిర్వహించేవారు వీటిని లెంకవళి దర్మం అంటారు.
గ్రామంలో పరిపాలన కొరకు అయ్యగార్ల విధానం ఉండేది. మొత్తం 12 మంది అయ్యగార్లు ఉండేవారు. వీరిలో 3గురు ప్రభుత్వ సేవకులు, మిగిలినవారు గ్రామ సేవకులు.
ప్రభుత్వ సేవకులు:
1. కరణం -- పన్ను లెక్కలు
2. రెడ్డి/కాపు -- పన్ను వసూలు
3. తలారి -- శాంతి భద్రతలు
గ్రామసేవకులు:
1. కుమ్మరి
2. కంసాలి
3. కమ్మరి
4. వడ్రంగి
5. మంగలి
6. చాకలి
7. వెట్టి
8. పురోహిత
9. చర్మకారుడు
న్యాయపరంగా న్యాయమూర్తిని ప్రాద్వివాక అనేవారు. ఇతను జారీచేసే ఆదేశాలను ముద్రవర్తులు అంటారు
2వ ప్రతాపరుద్రునికి నవలక్ష ధనుర్దారాధీశ్వరుడు అనే బిరుదు కలదు. దీని అర్ధం తొమ్మిది లక్షల కాల్బలం, 20 వేల అశ్వక బలం, 100 గజబలం కల్గినవాడు.
కాకతీయుల కాలంనాటి సమాజం
కాకతీయుల కాలాన్ని తెలుగు వారి స్వర్ణయుగం అంటారు.
వీరికాలంలో చతుర్ వర్ణ వ్యవస్థ ఉండేది కానీ వీరు ఆయా వృత్తులకు పరిమితం కాలేదు. శుద్రులూ అధికసంఖ్యలో ఉంది పాలక వర్గంగా ఎదిగారు. అందువల్లనే కాకతీయుల యుగాన్ని శూద్రుల స్వర్ణయుగం అని కూడా అంటారు.
ధర్మసాగర శాసనం 'జలకరండం' అనే సంగీతవాద్య పరికరాన్ని ప్రస్తావించింది.
బ్రాహ్మణ కుల సంఘాలను మహాజనులు అనేవారు.
వైశ్య కుల సంఘాలను వైశ్య నకరం అనే వారు.
అప్పట్లో వేశ్యలకు గౌరవప్రదమైన స్తానం ఉండేది.
వీరికాలంలో ప్రధాన వినోదం-తోలుబొమ్మలాట
వినుకొండ వల్లభాచార్యుని క్రీడాభిరామం
కేతన దశకుమార చరిత్ర : ఆభరణ అలంకారాల గురుంచి
సోమనాథుని బసవ పురాణం : స్త్రీలు, పురుషులు ధరించే వస్త్రాలు
ఆర్ధికవ్యవస్థ
కాకతీయులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇఛ్చారు.
వీరికాలంలో గొలుసు చెరువుల వ్యవస్థ ఉండేది/
పాకాల చెరువు, రామప్ప చెరువు, లక్నవరం, రుద్రసముద్ర తటాకం, కేసముద్రం, జగత్ కేసరి సముద్రం, బయ్యారం చెరువు, భద్రకాళి చెరువు, పోచారం చెరువు, పోట్ల చెరువు, శనిగరం చెరువు, ధర్మసాగర్ చెరువు, దేవి చెరువు మొదలగు చెరువులను త్రవ్వించారు.
నోట్: కాకతీయుల గొలుసు చెరువుల స్ఫూర్తితోనే TRS ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది.
చెరువులు సప్త సంతానాలో ఒకటిగా ఆనాడు పరిగణించేవారు.
సప్త సంతానాలు:
1. తన సంతానం
2. ఇతరుల సంతానం
3. రచన
4. ఇల్లు
5. వనము
6. చెరువు
7. గుడి
సాగుభూమిని 3 రకాలుగా వర్గీకరించారు
1. వేలిచేను
2. నీరునెల
3. తోటభూమి
పొలాన్ని గడ / దండ /కోల అనే ప్రమాణంతో కొలిచేవారు.
భూమి శిస్తును వారి అనేవారు. సాధారణంగా భూమి శిస్తు 1/6 వ వంతు ఉండేది.
అప్పట్లో వైశ్యలపై మరియు బిచ్చగాళ్లపై గణాచారి పన్ను విధించేవారు.
పశువుల మేతపై పుల్లరీ పన్ను విధించేవారు.
రాజదర్శనం కోసం దరిశనం అనే పన్ను చెల్లించేవారు
నిర్మల్ ఖడ్గాలు డమాస్కస్ (సిరియా) కు ఎగుమతి చేశారని పేర్కొంటారు.
మార్కుపోలో అప్పటి గోల్కొండ వజ్రపుగనుల గురుంచి పేర్కొంటారు.
వీరి కాలంలో అతి ముఖ్యమైన ఓడరేవు - మోటుపల్లి
వీరికాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధానకేంద్రం - ఓరుగల్లు
రాజుయొక్క సొంత పొలాన్ని రాచదొడ్డి అనేవారు.
వీరికాలంలో సాగు చేయబడని పంట - కంది.
కాకతీయుల కాలంనాటి మతం
వీరికాలంలో శైవ మతం బాగా వ్యాప్తి చెందింది.
శైవమతం 3 శాఖలుగా చీలిపోయి వ్యాప్తి చెందింది
1. పాశుపత శైవం
2. కాలముఖ శైవం (స్థాపకుడు - లకులీశ్వరుడు )
3. కాపాలిక శైవం
గణపతిదేవుడు పాశుపత శాఖను ఆదరించాడు. ఇతని గురువు విశ్వేశ్వర శంభు గోళకి మఠాలను స్థాపించి శైవమతాన్ని వ్యాప్తి చేసాడు.
వీరశైవ గురువులను జంగములు అంటారు
వీరి మత పుస్తకాలను ఆగములు అంటారు
వీరి అనుచరులను లింగాయతులు అంటారు
వీరికాలంలో బౌద్ధమతం పూర్తిగా అంతరించింది. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు.
సాహిత్యం
కాకతీయుల అధికారిక బాష - సంస్కృతం
వీరు తెలుగు భాషకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు
వీరికాలంలో అనేక తెలుగు పుస్తకాలు రచించబడ్డాయి
1. రంగనాథ రామాయణం - గోనబుద్ధారెడ్డి
2. భాస్కర రామాయణం - భాస్కరుడు
3. బసవపురాణం - పాల్కురిసోమనాథుడు
4. పండితారాధ్య పురాణం - పాల్కురిసోమనాథుడు
5. మార్కండేయ పురాణం - మారన
వీరికాలంలో రచించబడిన సంస్కృత గ్రంథాలు
1. నీతిసారం - రుద్రదేవుడు / ఒకటవ ప్రతాపరుద్రుడు
2. సకల నీతిసారం - ముడితి సింగన్న
3. నీతిసార ముక్తావళి - బద్దెన
4. సుమతీ శతకం - బద్దెన
5. ప్రతాపరుద్ర యశోభూషణం - విద్యానాథుడు
6. పురుషార్థ సారం - శివదేవయ్య
7. క్రీడాభిరాభం - వినుకొండ వల్లభాచార్యులు
8. ప్రేమాభిరామం - త్రిపురాంతకుడు
తెలంగాణ సాహిత్యంలో కాకతీయుల కాలం స్వర్ణయుగం అంటారు
తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కురిసోమనాథుడు ని తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా కీర్తించబడతారు.
వాస్తు శిల్పకళ
కాకతీయుల కాలంలో ఆలయ నిర్మాణాల్లో పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు.
వీరు త్రికూట ఆలయాలు నిర్మించారు
రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్పగుడిని నిర్మించాడు. ఈ దేవాలయంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో తేలుతాయి.
రుద్రదేవుడు హనుమకొండలో వేయిస్తంభాల గుడిని నిర్మించాడు
గణపతిదేవుడు ఓరుగల్లులో స్వయంభు దేవాలయాన్ని నిర్మించాడు
వీరికాలంలో ప్రధానంగా కనిపించేవి తోరణాలు.
కాకతీయుల సామంతులు
వీరి సామంత రాజవంశాలు
1. విరియాల వంశం
2. నటవాడి వంశం
3. గోన వంశం
4. చెరుకు వంశం
5. కాయస్థ వంశం
6. పోలవస రాజవంశం
7. గోండు రాజులు
8. మాల్యాల, బాచ వరూధిని
9. రేచర్ల రెడ్డి వంశం
10. పిల్లలమర్రి రేచర్ల రెడ్డి వంశం
11. ఎలకుర్తి రేచర్ల రెడ్డి వంశం
12. హైహయ వంశం
13. కొలనుపాక రాజ్యం
14. యాదవ రాజ్యం
విరియాల వంశం:
ఈ వంశస్థులు గూడూరు, మొరిపిరాల, కటుకూరు షమ్మి, రాయపర్తి వంటి శాసనాలు వేయించారు.
ఈ శాసనాల ప్రకారం ఈ వంశం యొక్క మూల పురుషుడు పోరంటి వెన్న మూల పురుషుడు
ఎర్ర నరేంద్రుడు/ఎర్రసేనాని
కాకర్త్య గుండన సోదరి కామసానిని వివాహం చేసుకున్నాడు
ఇతని కాలంలోనే 2వ తైలవుడు రాష్ట్రకూటులను అంతంచేశాడు
నటవాడి వంశం:
నటవాడి ప్రాంతాన్ని పాలించిన వీరికి దాని పేరు మీదుగానే నటవాడి వంశం అని వచ్చింది
దుర్గరాజు (క్రీ.శ 1104-57)
ఇతను వరంగల్ జిల్లాలోని నిడిగొండ శాసనాన్ని వేయించాడు
ఇతని భార్య పేరు ప్రోలమదేవి
ఇతని మరణం తరువాత ఇతని భార్య క్రీ.శ 1157 లో నవేపోతవరంలో శాసనం వేయించింది
గోన వంశం:
వీరు వర్ధమానపురం నుండి పరిపాలించారు
రుద్రమదేవికి అత్యంత విశ్వాసమైనవాడు గోన గన్నారెడ్డి
గుండాదండాదీశుడు
ఇతను క్రీ.శ 1245-46లో వర్ధమానపుర శాసనాన్ని, 1259లో బూదపుర శాసనాన్ని వేయించాడు
చెరుకు రెడ్డి వంశం
జలాల్ పురం శాసనం ప్రకారం కాటసేనాని ఈ వంశానికి ఆద్యుడు
కాయస్థ వంశం
వీరు మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడ్డారు
వీరి రాజధాని వల్లూరు (కడప జిల్లా)
అంబదేవుడు ( క్రీ.శ 1275-1302)
ఇతను తనకుతాను స్వతంత్రం ప్రకటించుకొని కాకతీయులకు శత్రువయ్యాడు
చందుపట్ల శాసనం ప్రకారం రుద్రమదేవి అంబదేవుని చేతిలో హతమైంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి