"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

మా గ్రంథాలయం

మా గ్రంథాలయం


మా గ్రంథాలయం అడవిలో జ్ఞాన జ్యోతి 
మా  గ్రంథాలయం నా ఆలోచనలకు 
వెలుగు చూపే సూర్యుడు 
నిశ్శబ్దంలో నన్ను నేను మరచిపోయే 
నవ కుటీరం 
బాల్యంలో నాకు  అమ్మే ఓ   గ్రంథాలయం 
మహనీయుల జీవితాలకు 
మంచిచెడుల మనోవికాసాలకు 
చిరునామా   గ్రంథాలయం 
చదువురాని వాడికి సైతం 
సర్వస్వం తానై మహోన్నతుడిని 
చేస్తుంది ఈ  గ్రంథాలయం
ఆలయంలో పూజారులు ,గంటల 
ధ్వనులు ఉంటాయి కానీ 
మా   గ్రంథాలయం, పూజారులు 
గంటలు, హుండీలు లేని ఆలయం 
భగవంతుడివ్వని వరాలను 
సైతం  నాకీ   గ్రంథాలయం 
ఇస్తుంది .
నాలోని ప్రతిభకి 
నా సమస్యలకి పరిష్కారం  గ్రంథాలయం.
దానిలోకి అడుగుపెడితే పుస్తకాలన్నీ 
నన్ను పలకరిస్తున్నట్లు 
నీకేదో చేబుతామంటూ 
పుస్తక పేర్లతో కనిపిస్తుంది .
ఈ సమాజానికి నేనొక 
 జ్ఞాన బండాగారమన్నట్లు 
ఉంటుంది ఈ   గ్రంథాలయం.
నాలుగు గోడలమధ్య నన్ను చదివి 
నవసమాజం నిర్మించమన్నట్లు 
నాకు భోదిస్తుంది ఈ  గ్రంథాలయం
పచ్చని  చెట్ల  మధ్య  
కలుపు మొక్కలు లేని పంటలా 
గగనంలోని జాబిల్లిలా 
ఆ పుస్తకాలన్నీ నా 
జీవితానికి వేలుగునిస్తాయి .
నాలోని  అజ్ఞానమనే చీకటిని 
తొలగిస్తుంది ఈ   గ్రంథాలయం
ఇంట్లోని మొదటి గురువులు
 అమ్మనాన్నలయితే  
తరగతి గదిలోని  ఆచార్యులు 
రెండో  గురువైతే 
అన్నివేళలా 
అందరికి  ఆది గురువైయింది 
ఈ   గ్రంథాలయం.

                                                                                                         యస్.వేణుగోపాల్
                                                                                                           యం,ఎ.తెలుగు 
                                                                                                       
                                                                                      హైదరాబాదు విశ్వవిద్యాలయం
      

పాలమూరు అందం ...

                                                                               
                                                                             
                                                   

పిల్లలమర్రి తల్లి, ప్రకృతి అందం పంచుతానంటుంది,
కోయిల్ సాగర్  కోటి దీపాలతో వెలుగుతానంటుంది 
తూర్పున సూర్యుడు పడమర చంద్రుడు తోడుతో,
చిన్న రాజమురు చిన్న చిన్న కోరికలతో 
మన్యంకొండలో  మురిసిపోతా నంటుంది, 
కృష్ణమ్మా వొడిలో ఎన్ని సార్లు మునిగినా తేలుతా నంటుంది,
కురుమూర్తి మీకు ఆర్తిని పంచుతానంటుంది,
గద్వాల్ కోటలో  తలదాచుకొమంటుంది భయమేస్తే
ఆలంపూర్ తుంగభద్ర తోడుగా ఐదో శక్తిపీఠంగా 
అచ్చంపేట అడవుల్లో అందంగా ఒదిగిపోతానంటుంది,
అమర చింత నీకున్న చింత తీర్చుతానంటుంది,
ప్రియదర్శినీ జూరాలా  ప్రేమికులను 
పిలుస్తోంది మాట్లాడుకోడానికి రమ్మని 
ఉమా మహేశ్వర క్షేత్రం ఊపిరిస్తా నంటుంది, 
సుంకేశుల సుడముచ్చాటగా చుసుకుoటానంటున్నది,
వలస ఎందుకోతావ్?  పాలమూర్ వలసకులీలుకాదు 
పాలమూర్ కష్ట జీవుల మనిపించుకుందాం 
రమ్మంటుంది  నా పాలమూరు జిల్లా ???

నా బాల్యం ..!!..??


అమ్మ
స్నానం చేయిoచి
నా నుదుటన బొట్టు పెట్టినరోజు 
తలదువ్వి జుట్టు కట్టి పూలుపెట్టినరోజు 
అమ్మ పాలిచ్చి 
ఉయ్యాలలో జోలపాట పాడి
నాన్నమ్మకు నన్ను అప్పజెప్పి 
నేను ఇంట్లో  పడుకున్నప్పుడు 
నాకు  చెప్పకుండా 
పొలానికి  వెల్లినరోజు 
కాలువ గట్టున గోనసంచి పై 
నన్ను పడుకో బెట్టి తాను
పొలం పనిచేసుకుంటున్న రోజు
పాలుతాగనని అలిగిన రోజు
తిను నాన్న చివరి ముద్ద  
నాన్న ముద్దా అమ్మ ముద్దా
చందమామ ముద్దా నీముద్ద
అని పాలబువ్వ తినిపించిన రోజు
నేపుట్టిన తరువాత మీనాన్న
అదిగో అని చూపినరోజు 
మళ్ళీ వస్తుందా ఆ రోజు  ???
'' ఎందుకంటే అమ్మ నిజం నాన్న నమ్మకం కాబట్టి ''