తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రాచీన కవుల రచనలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో దాస త్రయంగా ప్రసిద్ధి చెందిన పాలమూరు జిల్లా ప్రముఖ వాగ్గేయకారుడైనటువంటి వేపూరు హనుమద్దాసు కీర్తనలపైమద్రాసు విశ్వవిద్యాలయంలో ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా పొందారు .
కవి సమ్మేళనాలు
- 1. తెలుగు శాఖ సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల లేదా రజతోత్సవ డిగ్రీ కళాశాల , కర్నూలు , ద్రవిడ విశ్వవిద్యాలయము కుప్పం సంయుక్త ఆధ్వార్యంలో నిర్వహించిన శతజయంతి సాహితీమూర్తులు జాతీయ సదస్సు లో పాల్గొని శ్రీ శ్రీ సినిమా పాటలు విశ్లేషణ పై పత్రసమర్పణ చేసారు.
- 2. హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 45 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య శరత్ జ్యోత్స్నరాణి గారి, జ్యోత్స్నకళాపీఠము ఆధ్వర్యంలో జరిగిన యువకవిసమ్మేళనంలో పాల్గొని గ్రంథాలయం పై తను వ్రాసిన కవిత ను చదివి గ్రంథాలయ చైర్మన్ [సామ కృష్ణారెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందారు.
- 3. హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వార్యంలో నిర్వహించిన ఉగాది కవిసమ్మేలనం లో పాల్గొని ఉగాది పై తను వ్రాసిన కవిత చదివి హెచ్ సీయు విసి ప్రొ. హరిబాబు చేతుల మీదుగా సన్మానం పొందారు.
కర్నూల్ ఆకాశవాణి లో ప్రసారమైన కార్యక్రమాలు
- 1. ఘంటసాల జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం 2010 డిసెంబర్ 4.
- 2. వేటూరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం 2011 జనవరి 29.
- 3. కే.జే. యేసుదాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం 2011 జనవరి 10.
- 4. స్నేహం మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 19-02-2010.
- 5. వేణువు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 14 మే 2010.
- 6. పువ్వు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 17 సెప్టెంబర్ 2010]].
- 7. నవ్వు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 21 మే 2011.
జీవిత విశేషాలు
శ్రీవైష్ణవ వేణుగోపాల్ కవి పరిశోధకులు. ఈయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) తెలుగు పూర్తి చేసి మద్రాసు విశ్వవిద్యాలయంలో శ్రీవేపూరు హనుమద్దాసు కీర్తనలపై ఎం.ఫిల్ చేసి ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో తెలుగు సాహిత్యంలో సరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు.
శ్రీవైష్ణవ వేణుగోపాల్ 1990 డిసంబర్ 22వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం సూరారం గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటేశ్వర్లు మరియు తల్లిశ్యామలమ్మ. వేణుగోపాల్ తన జన్మస్థలం నందే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య 2006లో ఆ తర్వాత వీరభద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2008లో పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే వేణుగోపాల్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన కర్నూలులో వుండే సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలులో ఉన్నత విద్య ఆంగ్ల మాధ్యమంలో తన బి.ఎ. గ్రాడ్యుయేషన్ 2011లో పూర్తిచేశారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో వేణుగోపాల్ తన జీవితగమనమును నిర్ణయించుకొని అక్కడి చక్కటి వాతావరణాన్ని తన మేధస్సు అభివృద్ధికి ఉపయోగించుకున్నాడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నందు తెలుగు లో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2013లో పూర్తిచేశారు. ఆ తరువాత 2014లో ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ లో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసి ఆ తరువాత 2016 మద్రాసు విశ్వవిద్యాలయంలో వేపూరు హనుమద్దాసు కీర్తనలపై ఎం.ఫిల్ చేసి ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కాశీలో తెలుగు సాహిత్యంలోసరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)