జీవిత విశేషాలు

శ్రీవైష్ణవ వేణుగోపాల్ కవి పరిశోధకులు. ఈయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో స్నాతకోత్తర విద్య (ఎం.ఏ) తెలుగు పూర్తి చేసి మద్రాసు విశ్వవిద్యాలయంలో శ్రీవేపూరు హనుమద్దాసు కీర్తనలపై ఎం.ఫిల్ చేసి ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో తెలుగు సాహిత్యంలో సరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు


శ్రీవైష్ణవ వేణుగోపాల్ 1990 డిసంబర్ 22వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం సూరారం గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటేశ్వర్లు మరియు తల్లిశ్యామలమ్మ. వేణుగోపాల్ తన జన్మస్థలం నందే ప్రాథమిక విద్యమాధ్యమిక విద్య 2006లో ఆ తర్వాత వీరభద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2008లో పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే వేణుగోపాల్ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన కర్నూలులో వుండే సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలులో ఉన్నత విద్య ఆంగ్ల మాధ్యమంలో తన బి.ఎ. గ్రాడ్యుయేషన్ 2011లో పూర్తిచేశారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో వేణుగోపాల్ తన జీవితగమనమును నిర్ణయించుకొని అక్కడి చక్కటి వాతావరణాన్ని తన మేధస్సు అభివృద్ధికి ఉపయోగించుకున్నాడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నందు తెలుగు లో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2013లో పూర్తిచేశారు. ఆ తరువాత 2014లో ప్రభుత్వ ఉన్నత విద్య అధ్యయన సంస్థ లో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసి ఆ తరువాత 2016 మద్రాసు విశ్వవిద్యాలయంలో వేపూరు హనుమద్దాసు కీర్తనలపై ఎం.ఫిల్ చేసి ప్రస్తుతం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం కాశీలో తెలుగు సాహిత్యంలోసరస్వతి అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేస్తున్నారు.

1 comment: